Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘నోబెల్‌’ రాలేదని అసంతృప్తి.. ఇప్పుడు ‘పులిట్జర్‌’ పైన కూడా!

Donald Trump eyes Pulitzer Prize after Nobel Peace Prize disappointment
Advertisement
  • తనకు పులిట్జర్‌ రావాల్సిందని ట్రంప్‌ వ్యాఖ్య
  • నోబెల్‌ శాంతి బహుమతి కూడా రాలేదని అసంతృప్తి
  • రష్యా దర్యాప్తు కథనాలు తప్పుగా ఉన్నాయని ఆరోపణ
  • ట్రంప్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో వ్యంగ్య పోస్టులు
  • 2026 పులిట్జర్‌ అవార్డుల్లో ట్రంప్‌ ప్రభుత్వంపై కథనాలకు గుర్తింపు
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో అవార్డు కావాలట! యుద్ధాలు ఆపినందుకు నోబెల్‌ శాంతి బహుమతి రావాల్సిందని పదేపదే చెబుతున్న ఆయన.. ఇప్పుడు పులిట్జర్‌ పురస్కారంపైనా తనకు హక్కు ఉందంటున్నారు. నేను రాసిన రచనలకుగానూ ఆ అవార్డు రావాల్సిందని వ్యాఖ్యానించారు. దక్షిణ కరోలినాలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

పెండిల్టన్‌లోని టీ.ఈడీ గారిసన్‌ అరేనాలో జరిగిన సభలో ట్రంప్‌ మీడియాపై విమర్శలు గుప్పించారు. రష్యా దర్యాప్తునకు సంబంధించిన కథనాలకు పులిట్జర్‌ అవార్డులు అందుకున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి కథనాలు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపించారు. ఆ అవార్డులు అందుకున్నవారికి అవి దక్కాల్సింది కాదని వ్యాఖ్యానించారు. తనకు నోబెల్‌ శాంతి బహుమతి రాలేదని, పులిట్జర్‌ కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రచనలకుగానూ తనకు పులిట్జర్‌ రావాల్సిందని అన్నారు.

ట్రంప్‌ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రచనా నైపుణ్యంపై ఆయన చేసిన వాదనను ప్రశ్నించారు. ఇంగ్లిష్‌లో ఆయన మాట్లాడే తీరును ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు. పులిట్జర్‌ కోరుకోవడంపై కొందరు ఎగతాళి చేస్తూ పోస్టులు పెట్టారు.

2026 పులిట్జర్‌ పురస్కారాల్లో ట్రంప్‌ ప్రభుత్వం, దాని విధానాలపై వచ్చిన కథనాలకు కూడా గుర్తింపు లభించింది. ఫెడరల్‌ ప్రభుత్వ విభాగాల్లో మార్పులు, ఉద్యోగాల కోతల ప్రభావంపై కథనాలకుగానూ వాషింగ్టన్‌ పోస్ట్‌ అవార్డు అందుకుంది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన న్యాయశాఖ ఫైళ్ల విడుదలకు దోహదపడిన పరిశోధనాత్మక కథనాలకు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు గుర్తింపు దక్కింది. షికాగోలో ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన కఠిన వలసల నిర్బంధ చర్యలపై కథనాలకు షికాగో ట్రిబ్యూన్‌కు అవార్డు దక్కింది.
Advertisement
Advertisement
Donald Trump
Pulitzer Prize
Nobel Peace Prize
South Carolina Rally
US Presidential Elections
Media Criticism

More Telugu News